Crime మాతృత్వం ఓ వరమనే అంటారు ఆ వరం దొరక్క ఎంతో మంది మహిళలు అల్లడిపోతున్నారు.. అయితే కొందరికి ఆ దేవుడు ఈ వరాన్ని ప్రసాదించిన దాన్ని అందుకునే అర్హత మాత్రం లేకుండా చేసుకుంటున్నారు అభం శుభం తెలియని పసికందుల్ని రోడ్డుపాలు చేస్తున్నారు ఇలాంటి షాకింగ్ సంఘటన తాజాగా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది..
ఓ తల్లి కర్కసత్వం పసిబిడ్డను చెత్తబుట్ట పాలు చేసింది పుట్టిన మరుక్షణమే ఆ బిడ్డను చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయిన ఆ తల్లి ఎవరో కానీ ఈ విషయం చూసిన వారికి మాత్రం మనసు తరుక్కుపోతుంది.. అసలు విషయం ఏంటంటే అనకాపల్లి జిల్లా ఎస్ ఈ జెడ్ లోని ఓ వస్త్ర పరిశ్రమ ఉంది.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం స్పెషల్ ఎకనామిక్స్ జోన్ బస్సు తయారీ పరిశ్రమలో రోజులాగే బి షిఫ్ట్ కి హాజరైన మహిళలంతా తమ విధులను ఉంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతలో వాష్ రూమ్ కి వెళ్ళినవ్ మహిళ చిన్నారి ఏడుపులు విని ఏం జరిగిందని చూడగా అక్కడ చెత్తబుట్టలో అప్పుడే పుట్టిన మగ శిశువు కనిపించాడు… సహచర ఉద్యోగులకు ఆ మహిళ ఈ విషయం చెప్పడంతో అంతా కలిసి పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. చిన్నారిని దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి షిఫ్ట్ ముగించుకొని వెళ్తున్న మహిళలను ఆరా తీయడం మొదలుపెట్టారు పలువురిని ప్రశ్నించి అనుమానితిగా ఉన్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు..