Health గర్భవతిగా ఉన్నప్పటినుంచి పాలు ఇచ్చే గ్రంధులు తయారైనప్పటికీ బిడ్డ పుట్టి పాలు తాగడం మొదలు పెట్టకే పాల ఉత్పత్తి బాగుంటుంది.. దానికి చాలా మంది తల్లులకు పిల్లలకి పాలు ఎలా ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి అనేది పూర్తిగా తెలియదు..
బాలింత ప్రసవ గదిలోంచి బయటకు రాగానే బిడ్డకు పాలు ఇవ్వడం చాలా మంచిది. అయితే ఈ పాలను కూడా రెండు మూడు గంటలకు ఒకసారి ఇవ్వాలి అంటే రోజులో కనీసం ఒక ఎనిమిది సార్లు అయినా పాలు ఇవ్వడం చాలా మంచిది. శిశువుకు పాలను ప్రసవ గదిలోనుంచి బయటకు రావడంతోనే ఇవ్వడం మంచిది. ప్రతి రెండు గంటలకు బిడ్డకు ఆహారం అవసరం అవుతుంది. అంటే రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి. నెలలు గడిచే కొద్దీ పాలు పట్టే సమయం తగ్గుతుంది. 5 నుంచి ఆరు సార్లు ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. పిల్లలు బలహీనంగా ఉన్నా.. కాన్పు ముందుగానే జరిగినా ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. పిల్లలకు ఆకలేసినప్పుడు పాలు తాగాలి అనుకుంటే నోరు చప్పరించడం, గట్టిగా ఏడవడం లాంటివి చేస్తుంటారు.
తల్లి పోషకాహార పదార్థాలు తీసుకుంటే అవి పాల ద్వారా పిల్లలకి అందుతాయి. చనుమొనలను పట్టుకుని బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల సౌకర్యవంతంగా శిశువుకు పాలు అందుతాయి. కాళ్ళను మడిచి ఒడిలో వేసుకుని పాలు ఇవ్వడం వల్ల తల్లి ఎలాంటి నొప్పి కలగకుండా బిడ్డకు పాలు ఇవ్వచ్చు. తల్లి పాలను శిశువుకు ఇచ్చే ముందు రొమ్ములను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. పాలిచ్చే తల్లుల్లో రుతుక్రమం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది.