Dulquer Salmaan -King of Kotha Teaser : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు. టాలీవుడ్ తో పాటు ఈ హీరో ఇతర పరిశ్రమలో కూడా హీరోగా సినిమాలు చేసి అక్కడి ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఇప్పుడు తన సొంత ఇండస్ట్రీ నుంచి ఒక పాన్ ఇండియా సినిమాని సిద్ధం చేస్తున్నాడు. దుల్కర్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ‘కింగ్ ఆఫ్ కోత’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
ఈ మూవీ చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తాజాగా మూవీ టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లాంచ్ చేశాడు. ఈ సినిమాలో దుల్కర్ ని మరో గుర్తుండిపోయే పాత్రలో చూడబోతున్నం అంటూ టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ టీజర్ ని లాంచ్ చేశాడు మహేష్. యూట్యూబ్ లో తెలుగు టీజర్ చూడాలంటే సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లి తెలుగు బాషాని సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టులో ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఆగష్టులోనే చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar), రజినీకాంత్ జైలర్ (Jailer) సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కాబోతుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది.