Sai Pallavi: సాయిపల్లవి న్యాచురల్ స్టార్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే ,మన ఇండస్ట్రీలోని హీరోయిన్లపై అభిమానులే కాదు హీరోలు కూడా మనసు పారేసుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కూడా తనకు సాయి పల్లవి అంటే క్రష్ అని చెప్పాడు. అయితే అది ఏ రకమైన క్రష్ అనేది కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు గుల్షన్.
గతేడాది ‘బదాయిదో, బ్లర్’ చిత్రాల్లో నటించిన నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) చివరగా 8 AM మెట్రో (8 AM Metro) చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ‘లవ్ ఎఫైర్’ చిత్రంలో నటిస్తున్న తను.. సింగిల్‌గానే ఉంటున్నాడు. ఎందుకంటే రెండేళ్ల క్రితమే భార్యతో విడిపోయాడు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో గుల్షన్.. తనకు మలయాళ బ్యూటీ (Malayala Beauty), సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సాయి పల్లవిపై (Sai Pallavi) క్రష్ ఉందని తెలిపాడు. అంతేకాదు తన దగ్గర ఆమె నంబర్ కూడా ఉందని, కానీ తనను కాంటాక్ట్ చేయాలంటే భయమని చెప్పాడు. అయితే ఇది క్రష్ (Crush On Sai Pallavi) మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ‘తనంటే నాకు క్రష్. ఇది కొంతకాలంగా కొనసాగుతోంది. నా దగ్గర ఆమె నంబర్ కూడా ఉంది. కానీ కాల్ చేసేంత ధైర్యం లేదు. నాకు తెలిసి ఆమె అద్భుతమైన నటి, డ్యాన్సర్. అలాగే ఇది క్రష్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. కొన్నిసార్లు ఆమె పట్ల ఇన్‌ఫాచ్యువేషన్‌కు లోనయ్యాను. జీవితంలో ఒక్కసారైనా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అప్పుడు నా సంతోషానికి అవధులు ఉండవు. మిగిలిన వాటి గురించి నాకు తెలియదు. మిగిలినవి జరగకపోయినా చేసేదేముంది? ఏదైనా జరగాలనుంటే జరుగుతుంది, లేదంటే జరగదు. అయితే మంచి యాక్టర్‌తో నటించే అవకాశం వస్తే బాగుంటుంది. అందులో తప్పేమీ లేదు కదా. కనీసం ఆ చాన్స్ దక్కితే మంచిదే’ అని అభిప్రాయపడ్డాడు గుల్షన్.