Nandha Muri Balakrishna:ఈ ఏడాది మొదట్లో ‘వీరసింహా రెడ్డి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న బాలయ్య (Nandamuri Balakrishna) ప్రస్తుతం NBK108 చిత్రంలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) బాలయ్యకు జోడీగా నటించనుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sree Leela)) మరొక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, NBK108 అఫిషియల్ టైటిల్ (Official Title) ఇదేనంటూ తాజాగా నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
గతంలో ఈ చిత్రానికి ‘రామారావు గారు, రావు గారు’ తదితర టైటిల్స్ పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అఫిషియల్‌గా ‘భగవత్ కేసరి – ఐ డోంట్ కేర్’ (Bhagavath Kesari – I Don’t Care) అనే టైటిల్ ఫిక్స్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇందులో ‘కేసరి’ అనే పేరు చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించినది. ఈ లెక్కన NBK108 చిత్రంలో బాలయ్య క్యారెక్టరైజేషన్, చరిష్మా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అన్నింటి కంటే మించి ఈ మూవీలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుండగా.. వీరిద్దరి కాంబినేషన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
మరోవైపు, అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని చురుకైన వేగంతో చుట్టేస్తున్నాడు, అంటే వారు అనుకున్నదానికంటే ముందుగానే విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. వరుసగా అఖండ, వీరసింహా రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతున్న బాలయ్య ఎన్నికల విషయంలో కాస్త విరామం తీసుకునే ముందు సినీ ప్రేమికులకు అల్టిమేట్ ట్రీట్ ఇచ్చేలా చూసుకోవాలి.