Puneeth Rajkumar:కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే తనంటే ఇద్దరు సోదరులు శివన్న, రాఘవేంద్రకు చాలా ఇష్టం కాగా.. అయితే ఆ ప్రేమ కు సాటిగా రాఘవేంద్ర తన ఛాతీ పైన తమ్ముడి పచ్చబొట్టు వేపించుకున్నాడు .
కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) గురించి తెలిసిందే. శాండల్‌వుడ్‌లో పవర్‌స్టార్‌గా (Powerstar) పేరొందిన పునీత్‌ను అభిమానులు ముద్దుగా ‘అప్పు’ (Appu) అని పిలుచుకుంటారు. అయితే, 2021 అక్టోబర్‌లో ఆయన గుండెపోటుతో మరణించి కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్‌ను శోకసంద్రంలో ముంచేశాడు. ఇక తన ఇద్దరు సోదరులు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లకు (Shiva Rajkumar) సైతం తమ్ముడు పునీత్ అంటే చెప్పలేనంత ప్రేమ. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే.. శివన్న తన దు:ఖాన్ని ఆపుకోలేరు. ఇదిలా ఉంటే, తమ్ముడి జ్ఞాపకార్థం ఛాతిపై టాటూ వేయించుకున్నాడు రాఘవేంద్ర. అంతేకాదు ఆ పేరు కిందనే మరో రెండు పేర్లు కూడా ఉండగా.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
రాఘవేంద్ర.. తన ఛాతిపై ‘అప్పు’ పేరుతో పాటు ‘టోటో, నుక్కి’ పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. ‘అప్పు’ అంటే పునీత్ రాజ్‌కుమార్ అని అందరికీ తెలిసిందే కాగా.. మిగతా రెండు పునీత్ ఇద్దరు కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. నిజానికి.. తమకు, పునీత్‌కు వయసులో చాలా భేదం ఉండటంతో శివన్న, రాఘవేంద్ర ఎప్పుడు కూడా పునీత్‌ను తమ మొదటి బిడ్డగా భావించారు. అయితే, పునీత్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చాడు.