Spy Movie : కార్తికేయ 2 (Karthikeya 2), 18 పేజెస్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని ఈ గురువారం (జూన్ 29) ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఎడిటర్ గా మంచి పేరుని సంపాదించుకున్న గ్యారీ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఐశ్వర్య మీనన్(Iswarya Menon) హీరోయిన్ గా నటించింది. కార్తికేయ 2 తరువాత ఈ చిత్రంతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని నిఖిల్ పలకరించాడు.
ఆ మూవీ సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్ లో స్పై పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో సినిమా కథ ఉండడంతో మూవీ పై మరింత క్యూరియాసిటీని కలుగజేసింది. దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు 20 కోట్లకు పైగా అమ్ముడు పోయాయి. నిఖిల్ సినిమా ఈ రేంజ్ లో అమ్ముడు రికార్డు. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో అందుకొని నిఖిల్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.
బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. మొదటిరోజే దాదాపు 6 కోట్ల వరకు నెట్ షేర్ ని రాబట్టేసింది. ఇక ఈ మూడు రోజులు వీకెండ్ అవ్వడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే స్పీడ్ లో కలెక్షన్స్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అంటున్నారు. కాగా ఈ సినిమాని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.