Inaya-Sohel:బిగ్‌బాస్‌తో పరిచయం అయిన ఇనయా ఓ రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇనయా హడావిడి మామూలుగా లేదు. అయితే తాజాగా మరోసారి ఇనయా- సొహైల్ లవ్ ట్రాక్‌పై గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణమేంటంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇనయా కి సొహైల్ అంటే క్రష్ అని
ఇనయా నే చెప్పడం .
బిగ్‌బాస్ పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీలు అయిపోయారు. అయితే అందులో కొంతమంది మాత్రం అటు బుల్లితెర, ఇటు వెండితెరపై మంచి ఛాన్సులు కూడా కొట్టేశారు. సొహైల్ అయితే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక సొహైల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘బూట్‌కట్ బాలరాజు’ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజైన ‘రాజు నా బాలరాజు.. రాజు బంగారి రాజు’ సాంగ్ మంచి ట్రెండ్ అయింది. ఇన్‌స్టాలో ఈ పాటతో రీల్స్ కూడా చేస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. మరోసారి ఇనయా- సొహైల్ లవ్ ట్రాక్ తెరపైకి వచ్చింది. ఎలా అంటారా?
‘రాజు నా బాలరాజు’ సాంగ్‌తో రీల్స్ చేస్తూ ఇప్పటికే బిగ్‌బాస్ సెలబ్రెటీలు కొంతమంది సొహైల్ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక సొహైల్ అంటే చచ్చేంత పిచ్చి అని చెప్పే ఇనయా కూడా ఈ పాటకు మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేసింది. సిగ్గు మొగ్గేలేసేలా, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇనయా చేసిన డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ శారీలో ఇనయా చేసిన ఈ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇది చూసిన నెటిజన్లు.. కింద కామెంట్లు పెడుతున్నారు. “ఇంకా ఇనయా రాలేదేంటి అనుకున్నాం, సొహైల్ కోసమే కదా, ఈ డ్యాన్స్ ఏదో బీబీ జోడిలో చేసి ఉంటే విన్నర్ అయ్యేదానివి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.