నూతన నటుడు హస్వంత్ వంగా హీరోగా నమ్రత దారేఖర్, కతల్యాన్ గౌడ హీరోయిన్స్ గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వై.యుగంధర్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతా గోపాలకృష్ణ రెడ్డి (గోపి) నిర్మించిన రొమాంటిక్ రామ్ కమ్ ఫిల్మ్ “ఇప్పుడు కాక ఇంకెప్పుడు”. మార్చిలో రిలీజ్ కానున్న ఈ చిత్రం టీజర్ ను ఫిబ్రవరి 16న ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హస్వంత్ వంగా, నటి నోమినా తార, నటుడు అప్పజి, దర్శకుడు వై. యుగంధర్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, కెమెరామెన్ జెమిన్ జామ్ అయ్యనేత్, సంగీత దర్శకుడు సాహిత్యా సాగర్, ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్, పాటల రచయిత సురేష్ బానిశెట్టి తదితరులు పాల్గొన్నారు..
చిత్ర దర్శకుడు వై. యుగంధర్ మాట్లాడుతూ.. ‘ రామ్ కమ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఏసినిమాకైనా కథే హీరో.. దాంతోపాటు నిర్మాతే ఎప్పటికీ హీరో అని నేను బలంగా నమ్ముతాను..మా సినిమాకి మా నిర్మాత గోపాలకృష్ణ రెడ్డిగారి హీరో. నేను ఆయనకి కథ చెప్పాక.. చాలా బాగుంది.. నువ్ బాగా చేస్తావ్ అని నమ్మకంవుంది.. నువ్ దైర్యంగా చేయి నీ వెనుక నేనుంటాను అని ఈ సినిమా చేశారు. ఓటీటీలు వచ్చినా కూడా మన సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అని వెయిట్ చేసి మార్చ్ లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నేను నమ్మి పెట్టుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి ఈ చిత్రానికి వర్క్ చేశారు. ఖచ్చితంగా షూర్ షాట్ హిట్ కొడుతున్నాం అని కాన్ఫిడెన్స్ గా ఉన్నాం.. అన్నారు.
హస్వంత్ వంగా, నమ్రత దారేఖర్ కతల్యాన్ గౌడ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజ రామచంద్రన్, ఐడ్రీమ్ అంజలి, అప్పాజీ అంబరీష్, రాజా శ్రీధర్, జబర్దస్త్ రాఘవ, రాయ్ సింగ్ రాజు, వశిష్ఠ చౌదరి, నోమినా తార, నిఖిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ; జెమిన్ జామ్ అయ్యనేత్, మ్యూజిక్; సాహిత్యా సాగర్, ఎడిటర్; శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, కోరియోగ్రఫి; శ్రీ క్రిష్, లిరిక్స్; సాహిత్యా సాగర్, సురేష్ బానిశెట్టి, ఆర్ట్; బాబా అర్మోన్, పీఆర్ఓ; వంశీ-శేఖర్, నిర్మాత; చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన- దర్శకత్వం; వై. యుగంధర్.