జనరల్ గా కొందరు వారానికోసారి, ఇంకొందరి ఎప్పుడు వీలైతే అప్పుడు బార్బర్ షాపుకి వెళ్లి క్షవరం చేయించుకుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు, బార్బర్ షాపులు కిటకిటలాడతాయి. అలాంటి సందర్భాల్లో వెళ్లామే అనుకోండి, గంటలకొద్దీ సమయాన్ని అక్కడ గడపక తప్పదు. పైగా, క్షవరం చేసేవారు చేయడం మొదలెట్టాక కొందరు కొంచెం ఆలస్యంగా చేస్తారు, ఇంకొందరు కొంచెం స్పీడుగా చేస్తారు. కానీ, బార్బర్ బాబ్జీ కేవలం 47 సెకన్లలో క్షవరం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కాడు. కొంపదీసి మీరూ వెళ్లి చేయించేసుకుందామనుకుంటున్నారేంటి…?! ఆ కందిపప్పులేమీ ఉడకవు. ఎందుకంటే, ఆ బాబ్జీ వుండేది ఇక్కడ కాదు. గ్రీస్ లోని ఏథెన్స్ లో వుంటాడు. అతడి పేరు స్టాంటినోస్ కౌటోపిస్ అనే హెర్ స్టైలిస్ట్ సెకన్ల వ్యవధిలోనే హెయిర్ కటింగ్ ఎలాగనే అనుమానం అందరికీ కలుగుతుంది. అందుకే, గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముందుగానే కటింగ్ చేయించుకునే వ్యక్తి వెంట్రుకలను కొలిచి మరీ రికార్డు పనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వారు ఓకే చెప్పగానే కౌటోపిస్ కటింగ్ మొదలుపెట్టి 47 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే, కత్తెరతో కాకండా ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్, దువ్వెన సాయంతో కటింగ్ చేశాడు. మొత్తానికి హెయిర్ స్టైల్ ను బాగానే సెట్ చేశాడు. కటింగ్ పూర్తయ్యాక గిన్నిస్ బుక్ ప్రతినిధులు తలపై, ఇరువైపులా వెంట్రుకలను మళ్లీ కొలిచారు. ప్రమాణాల ప్రకారమే సరిగ్గా కట్ చేశాడని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సోషల్ మీడియాలో పెట్టారు.
‘అదీ కటింగేనా, ట్రిమ్మర్ తో కటింగ్ చేయడం పెద్ద గొప్పేం కాదు.’ అని కొందరు కామెంట్ చేస్తే ‘కొంచెం అటూ ఇటూ అయితే కటింగ్ కాదు, క్రాఫ్ మొత్తం చెడిపోతుంది. ట్రిమ్మర్ తో చేయడం అంత సులువేంకాదు.’ అని మరికొందరు పేర్కొంటున్నారు. చూశారుగా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
https://www.youtube.com/c/TeluguGoldenTV
Need a quick trim? How about a 45 second trim? 💇♂️ pic.twitter.com/DqeokLazg2
— Guinness World Records (@GWR) September 4, 2022


























