Health : గోధుమ పిండి, రవ్వతో పాస్తా తయారవుతుంది. కాబట్టి పాస్తాలో కూడా అన్నం లాగానే పిండిపదార్థాలు ఎక్కువ, దీనిని ఉడికించి రకరకాల సాస్‌లతో, కూరగాయలతో కలిపి తినవచ్చు. పోషక పదార్థాలు ఎక్కువ. మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచడంలో పాస్తా బెస్ట్ ఫుడ్. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మంచి హెల్తీ ఫుడ్‌ని ఉడికించిన నీటిలో కూడా అవే పోషకాలు ఉంటాయి. మీ పిల్లలకు పాస్తా ఇష్టమైతే మరీ ఎక్కున్న మోతాదుల్లో కాకుండా వారానికి ఓరోజు ఇవ్వండి.
అయితే కేవలం ఉడికించిన పాస్తా ఇవ్వకుండా దానితో పాటు క్యాప్సికం, క్యారెట్, బ్రొకోలి, క్యాలిఫ్లవర్, టొమాటో, పాలకూర, బఠాణీలు, మొదలైన కూరగాయలను కూడా కలిపి ఇస్తే పిల్లల ఎదుగుదలకు కావలసిన పోషకాలు లభిస్తాయి. ఉడికించిన గుడ్డు, చికెన్, చేప, కీమా కూడా ఈ పాస్తాతో పాటు ఇవ్వండి. మీరు పిల్లలకు పాస్తా తయారు చేసినప్పుడు అందులో కనీసం యాభై శాతం కూరలే ఉండేలా.
చూసుకోండి. మితంగా చీజ్ కూడా పాస్తాపై వేసి ఇస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. క్రీమ్, చీజ్ చేసిన వైట్ సాస్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది వీలున్నంత తక్కువగా వాడి, ఇంట్లో టొమాటోతో తయారు చేసుకునే పాస్తా సాస్నే వాడడం మేలు. ఈ మధ్య మార్కెట్లో ముడి గోధుమలతో (హోల్ వీట్) చేసిన పాస్తా, చిరు ధాన్యాలతో, చేసిన పాస్తా కూడా లభిస్తున్నాయి. మామూలు తెల్ల పాస్తా కంటే కూడా ఇవి ఇంకా ఆరోగ్యకరం. అయితే దీన్ని మరీ అంతిగా తీసుకోకూడదు. ఏదైనా మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలం.