వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ… అల్లరి నరేష్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అల్లరి నుండి ఫాలో అవుతున్నా. ఆయన ఫన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తా. గమ్యం, శంభో శివ శంభో లో ఆయన డిఫరెంట్ గా చేస్తే ఇంకా నచ్చేది. నరేష్ మొదటి నుండి అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పెద్ద సక్సెస్ అవ్వాలి. మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి.
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ గురించి నిర్మాత రాజేష్ గారు చెప్పారు. చాలా కంటెంట్ వున్న సినిమా అనిపించింది. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి కథలు ఎంచుకోవడంలో మంచి టేస్ట్ వుంది. మారేడుమిల్లి అంటే నాకు చాలా ఇష్టం. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పేరు పెట్టి అక్కడే సినిమా తీసిన దర్శకుడు మోహన్ గారికి కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా సహజంగా నటిస్తారు. . ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మంచి పాజిటివ్ టీం. 25 తేదిన అందరూ థియేటర్ కి వచ్చి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను.