politics నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహాం విజయనగరంలో ఘనంగా జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు..
నగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం ఈరోజు జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు మణిదీప్- స్నేహలను ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ దీవించారు. అలాగే ఈ వివాహానికి సీఎం జగన్ వెంట ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
బడ్డుకొండ అప్పలనాయుడు 2009 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. 2014 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడు చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం నుండి రెండవసారి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు.