Political తాము ఇంకా ఏ పార్టీతో పోతులు పెట్టుకోవాలి అనుకోవడం లేదని కేవలం ప్రజలు మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఈ విషయంలో తమపై వస్తున్న విమర్శలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు..
తమ పార్టీపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మదనపల్లెలో బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయాలు జమచేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ “తమకు కేవలం జనంతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజల్నే నమ్ముకున్నానని స్పష్టత ఇచ్చారు. తాను ఏం చెబుతానో, అదే చేసి చూపిస్తానన్నారు. ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్నా.. ” అంటూ విమర్శించారు సీఎం జగన్. అలాగే విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన జగన్.. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదని అన్నారు.. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి రావాలని అందుకుగాను తాను ఎంతవరకైనా సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు పిల్లలందరూ ఉన్నతమైన విద్య లభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.. అందుకు తన సహకారం ఆంధ్ర ప్రజలకు ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి విద్యార్థుల కోసం వారి చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టామని ఇంకా ఎన్ని డబ్బులు పెట్టడానికైనా తమ ప్రభుత్వం వెనకాడదని చెప్పుకొచ్చారు..