Movie ఉగ్రవాదులతో నిత్యం అల్లకల్లోలం అయ్యే ప్రదేశం.. మండే మంచు ముక్క జమ్మూ కాశ్మీర్.. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ అల్లకల్లోలం గానే ఉంటుంది నిత్యం రక్తపాతం జరుగుతూ ఉండే ఆ ప్రదేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుకుతున్నాయి అక్కడ రాజకీయాల్లో సామాజిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి వీటిలో భాగంగానే జమ్ము కాశ్మీర్లో సినిమా థియేటర్లు మొదలయ్యాయి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక సినిమాను అక్కడ రిలీజ్ చేయడం జరిగింది..
బిజెపి అధికారంలోకి వచ్చాక జమ్మూ కాశ్మీర్ పై ఫోకస్ పెట్టింది అక్కడ పరిస్థితులను క్రమక్రమంగా మార్చుకుంటూ వచ్చింది.. వీటిలో భాగంగానే మల్టీప్లెక్స్లను స్టార్ట్ చేశారు.. వీటికి జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోసింహ శ్రీకారం చుట్టారు.. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా శోపియాలలో సెప్టెంబర్ 18న మల్టీపర్పస్ సినిమా హాళ్లను మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇందులో ఒకదానిలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను.. మరో హాళ్లో బాగ్ మిల్కా బాగ్ సినిమాను ప్రదర్శించారు.
కాకుండా కాసేపు సినిమాను వీక్షించిన మనోజ్ సింహ దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు ఇంతే కాకుండా భవిష్యత్తులో జమ్ముల ప్రతి జిల్లాలో ఎలాంటి మాల్స్ వస్తాయని చెప్పారు.. కాశ్మీర్లో 1980 వరకు సినిమా హాల్స్ ఉండేవి ఆ తర్వాత ఉగ్రవాదులు బెదిరింపులకు భయపడి వాటిని మూసివేశారు మళ్లీ దాదా పిన్నేళ్ల తర్వాత సినిమాను రిలీజ్ చేశారు..

























