Political మెగా బ్రదర్ నాగబాబు ప్రతిక్షణం తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే నడుస్తున్నారు జనసేన పార్టీలో చురుకుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నాగబాబు ఈమధ్య సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్నారు అంతేకాకుండా జనసైనికులతో ఇంటరాక్షన్ కోసం Ask Nagababu’..Shoot Your Questions Now’ అంటూ వారితో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు అయితే ఇందులో భాగంగా జనసేనకులు కొన్ని ప్రశ్నలు సంధించారు అంతేకాకుండా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాలంటే కచ్చితంగా ఈ కండిషన్ ఒప్పుకోవాలంటే సలహా ఇస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయాలు పరంగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన వెంటే నడిచే జనసైనికులను కూడా సొంతం చేసుకున్నారు అయితే తాజాగా టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే కచ్చితంగా కొన్ని కండిషన్స్ టీడీపీకి పెట్టాల్సిందే అంటూ జనసేన చెప్పుకొచ్చారు..
అయితే ఇందులో భాగంగా జనసేనకు టీడీపీతో పొత్తు ఉందా లేదా అని ప్రశ్నించారు. అలాగే ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ బస్ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని ప్రశ్నించారు.. అలాగే మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి మద్దతు మాత్రమే ఇస్తారా లేక ప్రచారం కూడా చేస్తారా అని ప్రశ్నించారు అంతేకాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్లడం మంచిదేమో అంటూ సలహాలు ఇచ్చారు అలాగే ఒకవేళ టిడిపి తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను నిలబెట్టాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు జనసైనికులు..