విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేయటానికి లైగర్ టీం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా వుంది చిత్ర బృందం. పాన్ ఇండియా మూవీగా రానున్న లైగర్ ద్వారా విజయ్ బాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతోంది లైగర్ టీమ్ ఇప్పటికే పలు నగరాల్లో పర్యటిస్తూ సందడి చేస్తోంది.
అయితే తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నా… ఆయన సరసన బాలవుడ్ నటి జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని డిసైడ్ అయ్యా. జాన్వీ కాపూర్‌ని అడిగితే ఆమె కాల్‌షీట్లు సర్దుబాటు అవ్వలేదు. ఇంతలో కరణ్ జోహార్ అనన్య పాండేను తీసుకోమని సలహా ఇవ్వడంతో జాన్వీ తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం మిస్ అయింది. అనన్య చాలా మంచి నటి అని… ఆమెకి ఈ సినిమాతో ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయని పూరి జగన్నాథ్ అన్నారు.