Jatheeya Rahadari Movie Trailer Launched by Director VV Vinayak, Tummalapally Rama Satyabarayana, Narasimha Nandi, Madhu Chitti,
“జాతీయ రహదారి” థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్
భీమవరం టాకీస్ పతాకంపై* మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణనిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం థియేటర్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గారి చేతులమీదుగా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా*
ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ మాట్లాడుతూ… నరసింహ నంది అవార్డ్స్ సినిమాలు తీయటంలో దిట్ట మా రామ సత్యనారాయణ గారికి ఈ సినిమా తో ఆ అవార్డ్స్ కోరిక తీరుతుంది…ట్రైలర్ బాగా వచ్చింది సినిమా పెద్ద విజయం సాదించాలని కోరుకుంటూ టీం అందరికి అల్ ద బెస్ట్ అని అన్నారు..
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా వెనుక మా వినాయక్ గారి సపోర్ట్ ఉంటుంది..ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు మంచి సపోర్ట్ చేసారు.. మా దర్శకుడి కోరిక ఈ ట్రైలర్ ని వినాయక్ గారు చేతులు మీదుగా చేయాలి అని వారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.అల్ రెడి ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి నామినేట్ ఐనది..68 వ జాతీయ అవార్డ్స్ కి కూడా అప్లై. చేయటం జరిగింది..ఇదీ మా విజయానికి పునాది అన్నారు..నరాసింహ నంది కి పూర్తి స్వేచ్ఛ మరియు బాధ్యత ఇచ్చి నిర్మించిన చిత్రం “జాతీయ రహదారి” ఈ సినిమా గొప్ప విజయం సాధించడమే కాక ఎన్నో అవార్డులు కూడా వస్తాయనే గట్టి నమ్మకం ఉందని అన్నారు..
చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ… నా మొదటి చిత్రం బెల్లంకొండ సురేష్ గారు విడుదల చేసినప్పుడు..శ్రీ వినాయక్ గారి సపోర్ట్ ఎంతో ఉంది…నేను పక్కా వినాయక్ గారి అభిమానిని. ఆయన మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయటం ఆయన గొప్పతన నికి నిదర్శనం..ఎప్పటికైనా ఆయన నిర్మాత గా ఒక ఫిల్మ్ తీయాలి , దానికి నేనే దర్శకుడు గా ఉండాలి అని నా కోరిక. ఆయన మాస్ డైరెక్టర్ ఐన వారిలో కూడా కళాత్మక గుణం ఉంది..ఈ రోజు అయనాతో ట్రైలర్ రేలీజ్ చేయించుకోవాలి అనే నా కోరిక తీరింది..
ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్,మురళి మోహన్ రెడ్డి, సంగీత దర్శకుడు సుక్కు,ఎడిటర్ నాగిరెడ్డి, మౌనశ్రీ..సమర్పకులు.. రవి కనగల ఫాల్గొన్నారు..
నటీనటులు:
మధు చిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, తెల్జేరు మల్లేశ్, గొట్టి మదన్, మాస్టర్ దక్షిత్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, అభి, నరసింహా రెడ్డి, గోవింద్ రాజు,
సాంకేతిక నిపుణులు:
సమర్పకులు.. రవి కనగల
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ
రైటర్, డైరెక్టర్ :- నరసింహ నంది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- టి. ఆంజనేయులు
మ్యూజిక్ :- సుక్కు
డి.ఓ.పి :- మురళి మోహన్ రెడ్డి
ఎడిటింగ్ :- వి.నాగిరెడ్డి
లిరిక్స్ :- మౌనశ్రీ మల్లిక్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్
https://youtu.be/AweMBYtMEAQ