Politics తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తాజాగా బీఆర్ఎస్ పార్టీని డిఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే అయితే ఈ పార్టీని విస్తరించిన పద్యంలో అన్ని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. అలాగే పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన కసరత్తులు మొదలుపెట్టేసినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైరల్ కామెంట్స్ చేశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బిఅర్ఎస్ పార్టీ పైన కేఏ పాల్ వైరల్ కామెంట్స్ చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నాయకులు మాజీ ఐఏఎస్ అధికారులు ఈ పార్టీలో చేరడం పైన తీవ్ర విమర్శలు గుప్పించారు కేఏ పాల్..
ఇప్పుడు ఆంధ్రలో ఉన్న నాయకులు మాది ఐఏఎస్ అధికారులు ఈ పార్టీలో చేరుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అన్నారు ఒకప్పుడు ఆంధ్రులను కేసీఆర్ బూతులు తిట్టారు ఈ విషయం ఎలా మర్చిపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా డబ్బుగా ఆశపడి కొందరు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు కేసీఆర్ అలాంటి ఆయన స్థాపించిన పార్టీలో మీరంతా చేరుతుంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదు ఇలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ చెప్పకు వచ్చారు.. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని రాష్ట్రం నుంచి వెళ్ళిపోమని చెప్పిన కేసీఆర్ మాటలు మరిచిపోయారా ఆయన చేసిన విమర్శలు మర్చిపోయి ఈరోజు మళ్ళీ అదే పార్టీకి ఎలా వెళ్తారు అంటే ప్రశ్నించారు..