Hero Kalyan Ram:మాస్ కామెడీ చిత్రాలు తరికెక్కించడంలో నందమూరి కుటుంబానికి తిరుగే లేదని చెప్పుకోవాలి. ఏ పాత్రలో నైనా అవలీళంగా డైలాగులు చెప్పే వారిలో హీరో కళ్యాణ్ రామ్ ఒకరు. హిస్టారికల్ చిత్ర నేపథ్యంలో తరికెక్కుతున్న చిత్రం బింబిసారా విడుదలకు సిద్ధమవుతుంది ఈ చిత్రం ముచ్చట్లు తెలుసుకోండి మరి.
డబ్ల్యూ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ హీరోయిన్లు సంయుక్త మీనన్, కేథరిన్ నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం “బింబిసారా”. ఈ చిత్రం భారీ అంచనాల నడుమున ఈ ఆగస్టు 5న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తరికేకుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడి గా పవర్ ఫుల్ పాత్రలో విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
అయితే ఇటీవల ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే ఈవెంట్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాగా అభిమానులలో మరింత రెట్టింపు పెంచారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఈ సినిమాలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. భారీ అంచనాల వస్తే భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఆ గ్రాండియర్ లుక్, విఎఫ్ఎక్స్ పరంగా పెద్ద సినిమాగా అనిపిస్తుంది. బింబిసారను బాహుబలి లైన్ లో చేర్చి.. మరో బాహుబలి తర్వాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా? అంటూ కళ్యాణ్ రామ్ ని అడగగా.. దయచేసి బింబిసారను బాహుబలితో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్ల వరకు వెళ్ళింది. ఇది మేము మాకున్న బడ్జెట్, నిర్మించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు రామ్.ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట చక్కెరలు కొడుతున్నాయి.