ఇదివరకు ఎవరి నోట విన్నా కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ పేర్లే వినిపించేవి. ఇప్పుడు వాటిని వెనక్కి నెట్టి నెంబరు 1గా నిలిచింది కన్నడ మూవీ కాంతార. కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కాంతార మూవీ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచి 9.5 రేటింగ్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది.
సెప్టెంబరు నెలాఖరులో ఓ సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలనే వెనక్కి నెట్టి సత్తా చాటుకుంది. ఇప్పటి వరకు ఐఎండీబీ రేటింగ్స్‌లో కేజీఎఫ్ 2 సినిమా 8.4 సాధించగా ఆర్ఆర్ఆర్ 8 రేటింగ్ పొందింది. ఈ రెండు సినిమాలను బీట్ చేసి కాంతారా ఏకంగా ఆసాధారణమైన 9.5 రేటింగ్ దక్కించుకుంది. ఇప్పటికే హిందీలో రిలీజై ఆకట్టుకుంటోన్న ఈ కన్నడ మూవీ తాజాగా తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది.