కుటుంబ సాంప్రదాయానికి ప్రతి రూపం “కాసం” సంస్థలు నిలుస్తాయని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్ట లోని పాపడమ్స్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన కాసం వెబ్ సైట్, లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి విశిష్ట అతిధి ప్రముఖ సినీనటి కుమారి సురభితో కలిసి మేయర్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ:
• కాసం పుల్లయ్య 1945 సం.లో 3 గుమస్తాలతో వస్త్ర ప్రపంచంలోకి అడుగిడడం జరిగిందని, 1986 సం. నాటికి 3 వేల మంది సిబ్బందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం హర్షణీయం అని, కుటుంబ సభ్యులు అన్నదమ్ముల ఐక్యతతో వరంగల్ నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా బ్రాంచ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ధరలలో వస్త్రాలను అందజేస్తున్నారని, రామన్నపేట ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకోవడం వారి కష్టపడే తత్వానికి నిదర్శనం అని అన్నారు.
• సినీనటి సురభి మాట్లాడుతూ: వరంగల్ నగరానికి తొలిసారి రావడం సంతోషంగా ఉందని, వస్త్ర రంగంలో ఆశావహులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. పురుషులు, మహిళలు, చిన్నారులకు వివిధ రకాలైన డిజైన్లలో వస్త్రాలు అందుబాటులో ఉంచడం ముదావహం అని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్యాషన్ షో పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాసం సంస్థల ఛైర్మెన్ కాసం నమః శివాయ, కాసం శివ కుమార్, అశ్విన్, సాయి, ఫణి తదితరులు పాల్గొన్నారు.