అశేష హిందు భక్తజనులారా ! రామేశ్వర కాశీ యాత్ర – మహాదేవ మోక్ష సేవ – మహావిష్ణు అపర సేవ లకోసం మమ్మల్ని సంప్రదించగలరు.. ఇంతకీ ఈ ఆలోచన ఎందుకొచ్చిందంటే.. మాది సంప్రదాయ కుటుంబం, మేము ఈ మధ్య కాలంలో కాశీ యాత్ర చేశాం, అది కూడా వారాహీ అమ్మవారి దర్శనార్ధం. అయితే అక్కడ మాకు తెలిసిన విషయమేంటంటే.. మొదట రామేశ్వరం దర్శనం చేశాకే కాశీ యాత్ర చేయాలని అన్నారు. దీంతో మాకొక ఆలోచన వచ్చింది.
వెంటనే మేము ఇలాంటి యాత్ర ఒకటి ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది ? అనిపించింది. వెంటనే మా జోశ్యుల బాలకృష్ణను సంప్రదించగా.. ఆయన సరే, మీరు మొదలు పెట్టండి మీకు మేము సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. దీంతో అక్టోబర్ 17 పౌర్ణమినాడు హైదరాబాద్ నుంచి బయలు దేరి రామేశ్వరం. అక్కడి నుంచి కర్ణాటక మలనాడు ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సందర్శనం.. ఆపై ప్రయాగలో క్రతు నిర్వహణ.. అటు నుంచి దీపావళి నాటికి కాశీలో ఉండేలా ఒక యాత్రా రచన చేశాం.
అంతే కాదు.. మాకు మరో ఆలోచన కూడా వచ్చింది.. అదేంటంటే.. అక్కడే మహా దేవ మోక్ష సేవ, మహా విష్ణు అపర కర్మల సేవ సైతం నిర్వహించేలా మన వారి కోసం (మన హైందవాచార పారాయణుల కోసం) కాశీ రామేశ్వరం ట్రస్ట్ ద్వారా.. ఒక సేవా సెంటర్ పెట్టాలనిపించింది. చాలా మంది హిందువులకు కాశీలో శివైక్యం చెందాలన్న ఆలోచన బలంగా ఉంటుంది. కానీ సాధ్యం కాదు. మనకు తెలిసిన వారు ఇలాంటి సర్వీసు అందిస్తారని తెలీక పోవడం వల్ల అది వీలు కాదు. దీంతో వారు తమ తమ ఆలోచనలను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. కానీ వారికంటూ ఒక తెలిసిన వారుంటే ఇలా చేసే వీలు కలుగుతుంది కదా? మనమెందుకలా చేయకూడదనిపించింది. అందుకే మొదట సంప్రదాయ ప్రకారం రామేశ్వరం నుంచి కాశీ యాత్రను ప్రారంభించాం.
ఆపై కాశీలో ఒక స్థిర నివాసం ఏర్పరిచి.. ఇలాంటి సేవా కార్యక్రమాలను అత్యంత చవకగా నిర్వహించి.. హిందూ సంప్రదాయాల ప్రకారం.. వారికంటూ ఒక సేవ భాగ్యం కల్పించాలని.. పది మందికీ మన సంప్రదాయాన్ని పరిపరివిధాల పంచాలని భావించాం. దూరా భారాల కారణం వల్ల మనం రామేశ్వరం వెళ్లి కాశీకే వెళ్లలేక పోతున్నామంటే.. ఇక కాశీలో ఉండి ఆ మహా కాళేశ్వరుడు కొలువైన మణికర్ణికలో మాత్రం ఎలా ఐక్యమవుతాం! ఆపై గంగా తీరాన అపర కర్మల భాగ్యాన్ని ఎలా పొందగలం? అందుకే మొదట రామేశ్వర కాశీ యాత్ర. ఆపై.. మహా దేవ మోక్ష సేవ, దీంతో పాటు మహా విష్ణు అపర కర్మ సేవలను ఒక స్టార్టప్ గా మొదలు పెట్టాం.
ఆసక్తిగల వారు ఎవరైనా ఉంటే.. ఈ మూడు సేవల కోసం మమ్మల్ని సంప్రదించగలరు.
బాలకృష్ణ జోశ్యుల(ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ రాజ్ న్యూస్) (8542882227)
ఆదినారాయణ సర్వేపల్లి(కవి\రచయిత\జర్నలిస్ట్\ఇన్ ఫ్లూయెన్షర్) (9490916476)
నాగేశ్వరి సర్వేపల్లి(సీఈఓ సత్య ధర్మ దర్శనం యూట్యూబ్ చానెల్) (7569299631)
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్