తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ హాజరై సందేశం ఇచ్చారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్ తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అమరవీరులకు నివాళి అర్పించారు. అంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం లోని ముఖ్యాంశాలు :
- గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం ఇది – కేసీఆర్
- తెలంగాణ అని మాట్లాడడమే కష్టంగా ఉన్న రోజులు..తెలంగాణ అనకూడదని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసిన రోజుల నుండి నేడీ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు
- రాజీలేని పోరాటం చేసిన జయశంకర్ నాతో ఉండేవారు
- కఠోరమైన సిద్ధాంతాలు నమ్మేవాళ్లు కూడా..ఒక్కోసారి ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి పని చేయాల్సి వస్తుంది
- ఉద్యమంలో తెలంగాణ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి
- 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది.చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారు
- తెలంగాణకు జరిగే అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూ వచ్చారు
- 1969 నాటి ఉద్యమంలో ప్రధానమైన అంశం ముల్కీ రూల్స్ . ముల్కీ రూల్స్‌పై ఆనాడు విద్యార్ధులు, యువకులు కొట్లాడారు
- రాజ్‌భవన్ గేటు ఎదురుగా బుల్లెట్లు కొడుతుంటే వీళ్లు రాల్లేశారు.చస్తారని తెలిసినా తూటాలకు ఎదురెళ్లారు. రైలు పట్టాల మీద పడి 8, 9 మంది చనిపోయారు.అంత పోరాడినా అప్పుడు తెలంగాణ రాలేదు – కేసీఆర్
- ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది.ఈ సమయంలో జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేం.ప్రొఫెసర్ జయశంకర్ వంటి మనుషులు అరుదుగా ఉంటారు.
- తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పది
- ఏపీ ఏర్పడిన తరువాత కూడా టీఎన్జీవో సంఘం కొనసాగింది.
- ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్ భావించారు
- బతుకమ్మ అనే సినిమా నేను తీద్దామనుకున్నా..కథ కూడా రాశా
కానీ వాడెవడో తీశాడు.. అందులో ఏమీ లేదు - సుప్రీంకోర్టు తీర్పును కాలరాసి రాజ్యాంగ సవరణ చేసినా ఎవరూ మాట్లాడలేదు.
- అప్పుడు మీటింగ్‌లు పెట్టినా పది, పదిహేను మంది కూడా వచ్చేవారు కాదు
- పాలమూరులో సభ పెట్టి నేను పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి
- తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు.కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్లు కూడా లేరు అప్పట్లో కుడి కాలువకు ఫ్రీ, ఎడమ కాలువకు ఛార్జీలు వసూళ్లు చేసేవాళ్లు
- సమైక్యరాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది
- అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ ఛార్జీలు పెంచితే కోపంతో లేఖ రాశా విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు వ్యవసాయం చేయలేరని లేఖ రాశాను
- తెలంగాణ వస్తుందని ఎవరూ కూడా కల కనలేదు
- 15 ఏళ్ల పోరాటం తరువాత తెలంగాణ వచ్చింది
- బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు
- ఇవన్నీ టెంపరరీ సెట్‌బ్యాక్స్.. మళ్లీ అధికారంలోకి వస్తాం
25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయడం అంత సులభమా.?
పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది ఖతమైందా? మల్ల అధికారం లోకి మనమే - గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ ప్రజల రక్షణకోసం.అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు – కేసీఆర్
- అధికారంలో ఉంటేనే రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలు యే పాత్రిస్తే అది నిర్వర్తించాలే. ప్రజల ఆకాంక్షలకోసమే బీఆర్ ఎస్ పనిచేస్తుంది. బిఆర్ఎస్ అంటే మహావృక్షం – కేసీఆర్
- అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. బస్సు యాత్ర మొదలు పెట్టగానే మళ్లీ అదే గర్జన – కేసీఆర్
- ఓట్ల కోసం రైతుబంధు ఇవ్వలేదు – కేసీ
చేప పిల్లలు, గొర్రె పిల్లలు పంపిణీ చేస్తే అపహాస్యం చేశారు
బీఆర్‌ఎస్ హయాంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్ఠం చేశాం - కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి -కేసీఆర్
ఎదురుదెబ్బలు తాత్కాలికమే.. మళ్లీ అధికారంలోకి వస్తం -కేసీఆర్ - లైన్‌మెన్‌లను హరీష్‌రావు పని చేయనివ్వడం లేదని సీఎం రేవంత్ అంటున్నారు
- అసలు ముఖ్యమంత్రి హరీష్‌రావా?.. రేవంత్‌రెడ్డా? – కేసీఆర్
- దళితబంధు పథకం అతీగతీ లేదు
- అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాం
- ఎగ్జిట్‌పోల్స్‌లో బీఆర్‌ఎస్‌కు 11 వస్తాయని ఒకరు చెబుతున్నారు
- ఒక సీటు వస్తుందని ఒకరు చెబుతున్నారు – కేసీఆఆర్
- 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు..3 సీట్లు వచ్చినా కుంగిపోయేది లేదు – కేసీఆర్
- ఎగ్జిట్‌పోల్స్ ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయి
- సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని రేవంత్ ప్రకటించారు.
- 100కు పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెలిచారు
- నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చింది -కేసీఆర్
- రాజకీయ జయాపజయాలు మనకి లెక్కకాదు
- ప్రజలకు ఆవేశం వస్తే ఎవరు ఆపినా ఆగరు – కేసీఆర్
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్