Keerthy Suresh: కీర్తి సురేశ్ మహానటి గా ఎందరినో అభిమానులను సంపాదించిన ఈ ముద్ధుగుమ్మ పైన ఒక పుకారు వైరల్ అవుతుంది .
ఈ మధ్య కాలంలో సోషమ్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోయింది. నిజమా కాదా అని తెలిసేలోపే ఏది పడితే అది రాసిపారేస్తున్నారు. ఇక ముఖ్యంగా హీరోయిన్ల ఎఫైర్స్, లవ్, మ్యారేజ్‌పై అయితే చెప్పక్కర్లేదు. వాళ్లే ఇలాంటి పుకార్లు సృష్టించేస్తున్నారు కూడా.అయితే ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్‌పై కూడా కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
కీర్తి సురేశ్.. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కీర్తి-ఫర్హాన్ ఫోటో ఒకటి వారం క్రితం సోషల్ మీడియాలో రావడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ తమిళ మ్యాగజైన్ అయితే దీనిపై పెద్ద స్టోరీ పబ్లిష్ చేసింది. అందులో కీర్తి- ఫర్హాన్ అతి త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని రాసేశారు.
దీంతో కీర్తి తండ్రి జీ సురేశ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తన కూతురి పెళ్లిపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు .
“కీర్తి- ఫర్హాన్ మంచి ఫ్రెండ్స్. వారి మధ్య అంతకు మించి ఏమీ లేదు. నా కూతురిపై వస్తున్న రూమర్స్ నిరాధారమైనవి. అలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దు. ఆమెను ఒంటరిగా వదిలేయండి. కీర్తి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజున అందరికీ నేనే ముందుగా తెలియజేస్తాను.”
తనపై వస్తున్న రూమర్స్ గురించి కీర్తి సురేశ్ కూడా ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది.
“హాహా.. ఈ విషయంలోకి నా ఫ్రెండ్‌ను లాగాల్సిన అవసరం లేదు. అసలు మిస్టరీ మ్యాన్ గురించి టైమ్ వచ్చినప్పుడు నేనే బయటపెడతాను. అప్పటి వరకు కాస్త చిల్ అవ్వండి. ఒక్కసారి కూడా సరిగ్గా రాయలేదు”