Health కిడ్నీలు.. మనిషి జీవ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహిస్తాయి.. ఇలాంటి కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. లేదంటే పెను ప్రమాదాలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి కొన్ని రకాల కిడ్నీ డిసీజ్ ల కోసం తెలియదు. అందులో ముఖ్యంగా చెప్పేది పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్..
కిడ్నీ సమస్యలతో బాధపడే చాలామంది ప్రధాన సమస్య వారికి షుగర్, హైబీపీలు ఉండటం. వీటివలన కిడ్నీలు మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ ఆడ, మగ ఇద్దరిలోని ప్రధానంగా కనబడే ఆరోగ్య సమస్య..కొన్ని సందర్భాల్లో పిల్లల్లో కూడా ఈ సమస్య వేధిస్తుంది.. ఇది వంశపారపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాల్లో ఒక రకమైన తిత్తులు ఏర్పడతాయి.. దీనివలన వెన్నునొప్పి.. పల్స్ ఎక్కువగా ఉండటం.. పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి..
ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవాళ్లకి మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ఇలా కనిపించే వాళ్ళు ఆరోగ్యాన్ని అజాగ్రత్త చేయరాదు. వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది.. లేదంటే పెను ప్రమాదంలో పడినట్టే. ఇది మాత్రమే కాకుండా కిడ్నీ క్రియాటిన్, కిడ్నీలో రాళ్లు వంటివి కూడా కిడ్నీకి సంబంధించిన ప్రధాన ఆరోగ్య సమస్యలు..ఇలాంటివారు రోజు తప్పకుండా ఆరు నుంచి పది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం చాలా అవసరం