యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం “సమ్మతమే” చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ ఆసక్తికరంగా వున్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ ఉన్నంతంగా వుంది. సతీష్ రెడ్డి మాసం అందించిన విజువల్స్ సూపర్ కూల్ గా వున్నాయి. ట్రైలర్ కి శేఖర్ చంద్ర అందించిన బీజీయం చాలా రిఫ్రషింగ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్న ట్రైలర్.. సినిమా పై అంచనాలు పెంచింది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… “ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారు. ఈనెల 24న సినిమా రిలీజవుతోంది. అందరూ థియేటర్లకు వెళ్లి, సినిమా చూసి ఆదరించండి. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్” అన్నారు.
హీరోయిన్ చాందిని మాట్లాడుతూ… “సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకున్నవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. నా మనసుకి నచ్చి చేసిన క్యారెక్టర్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. ఈ స్టోరీ వినగానే నా మనసుకి ఇది చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి సినిమా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… “ట్రైలర్ లాంచ్ చేసిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. మీకు ట్రైలర్ నచ్చిందని చెప్పడం, కొత్తవాళ్ళు రావాలని మీరు ఎంకరేజింగ్ గా మాట్లాడటం ఆనందంగా ఉంది. మా సినిమా నచ్చి, ఈ సినిమాని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సాయం చేస్తున్న అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. సినిమా గురించి ఇక చెప్పడాలు ఏం లేవు. సినిమా పట్ల మేం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. జూన్ 24 న అన్నింటికీ మీతో సమ్మతమే అని మేం చెప్పిస్తాం. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు.” అన్నారు.