Konidala Sreeja : మెగా డాటర్ కొనిదల శ్రీజ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె తన భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయారని.. ప్రస్తుతం వీరు వేరు వేరుగా ఉంటున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. అలాగే కొంతకాలంగా వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్న పోస్టులు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే ముఖ్యంగా శ్రీజ షేర్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంది. ఇక ఇటీవల ఆమె వరుసగా ఎమోషనల్ పోస్ట్స్ చేస్తున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా.. ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ శ్రీజ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇక అలాగే.. ఐయామ్ లివింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ శ్రీజ చేసిన పోస్ట్.. కళ్యాణ్ దేవ్ తో విడిపోయారనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా తాజాగా ఆమె మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఆ పోస్ట్ లో.. నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే. జీవితంలో వచ్చే చీకటికి వెలుగులు నువ్వే నింపావ్. నేను ఉదయం లేస్తున్నానంటే దానికి కారణం నువ్వే. 14 ఏళ్ల వయసులో నువ్వు పరిచయం అయ్యావ్. అప్పటి నుంచి నాతోనే ఉంటున్నావ్. థాంక్యూ మై డియర్ కాఫీ” అంటూ రాసుకొచ్చారు శ్రీజ. దీంతో శ్రీజకు కాఫీ తాగే అలవాటు బాగా ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి మొదటి కుమార్తె సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలకు తండ్రితో కలిసి పనిచేశారు.