హైదరాబాద్ : బ్రిటన్ ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) సభ్యుడిగా ఎంపికైన ప్రవాస భారతీయుడు శ్రీ ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆయన ప్రస్థానాన్ని కొనియాడారు. “ఇంగ్లాండ్ రాజు చేతుల మీదుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయినందుకు ఉదయ్ నాగరాజు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు. యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేయడం దగ్గరి నుంచి మొదలుకొని.. నేడు ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం వరకు మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మీ కొత్త బాధ్యతల్లో మీకు అంతా మంచే జరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని కేటీఆర్ పేర్కొన్నారు.


























