సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేశారు.
అపర్ణకు రోహిత్ తన ప్రేమను ప్రపోజ్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే రామ్ మాత్రం ‘రాముడు మంచి బాలుడు’ టైపు కాదు. అతను చాలా స్వార్థపరుడు, చాలా మంది అమ్మాయిల ఎమోషన్ తో ఆడుకుంటాడు. అపర్ణతో ప్రేమ ప్రయాణంలో రామ్ మంచి వ్యక్తిగా మారతాడా? అనేది కథాంశం.
కె దశరధ్ అందించిన కథ ఈ తరం యువతకు బాగా నచ్చుతుంది. డివై చౌదరి సబ్జెక్ట్ ని అద్భుతంగా హ్యాండిల్ చేసారు. డైలాగ్స్ కూడా చాలా ఇంపాక్ట్ గా ఉన్నాయి. రోహిత్ బెహల్ ప్లజంట్ గా కనిపించాడు. అపర్ణ జనార్దనన్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ , సంగీత దర్శకుడు కె వేద బ్రిలియంట్ . ఈ చిత్రానికి ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.
సుధాకర్ బొర్రా (టేనస్సీ) , డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ డైలాగ్స్ రాశారు. లవ్ యు రామ్ జూన్ 30న విడుదలౌతుంది.