హైదరాబాద్, డిసెంబర్ 14, 2023 : విమర్శకుల ప్రశంసలు పొందిన గాయకుడు కింగ్ హైదరాబాద్ ఆహ్వాన్ రిసార్ట్ మండల్‌లో డిసేంబర్ 15, 2023న తన తన మెలోడీలతో రాడికో ఖైతాన్‌కు చెందిన మ్యాజిక్ మూమెంట్స్ మ్యూజిక్ స్టూడియో, 8పీఎం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌తో హైదరాబాద్ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయబోతున్నారు. బుక్‌మైషోతో కలిసి ఈ రెండు బ్రాండులు దేశంలోని వివిధ నగరాల్లో మ్యూజిక్ టూర్ – కింగ్ న్యూ ఇండియా టూర్ 2023లో సహ-భాగస్వాములుగా నిలుస్తున్నాయి.
సంగీతం, కళాకారులకు చేయూతనివ్వడం, ప్రోత్సహించడంలో ర్యాడికో ఖైతాన్‌కు ఘన చరిత్ర ఉంది. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌తో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధం, అలాగే ఇటీవల బాలీబూమ్‌తో సహకారాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ సహకారంపై రాడికో ఖైతాన్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమర్ సిన్హా మాట్లాడుతూ… “సరిహద్దులను అధిగమించే విశ్వశక్తి సంగీతమని, అలాగే ప్రపంచమంతా అర్థం చేసుకొని వ్యక్తులను ఒక్కటి చేసే భాష ప్రేమ అని రాడికో ఖైతాన్ గుర్తించింది. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్, ప్రతీక్ కుహడ్, రోనన్ కీటింగ్ వంటి పరిశ్రమ దిగ్గజాలతో విజయవంతమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యూజికల్ టూర్ కోసం బుక్‌మైషోతో భాగస్వామ్యాన్ని ప్రకటిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సంగీతంలోని వైవిధ్యపు గొప్పతనానికి ప్రతిబింబం కింగ్. ఈ సహకారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో ఆయన కళాత్మక మాయాజాలాన్ని ప్రతతిధ్వనించేలా గొప్పగా చూపించే వేదిక ఏర్పాటు చేయడం మా లక్ష్యం” అన్నారు.
కోల్‌కతా, గురుగ్రామ్, పుణే, లక్నోలో విజయవంతమైన షోల తర్వాత ఇప్పుడు కింగ్స్ న్యూ ఇండియా 2023 హైదరాబాద్‌కు రాబోతోంది. దీని తర్వాత వారి ప్రదర్శనలు అహ్మదాబాద్, గోవా, గౌహతిలో ఉంటాయి. విశిష్ఠమైన కింగ్ మ్యూజికల్ స్టైల్, స్టేజ్ ప్రెజెన్స్‌ను ఈ టూర్ ప్రదర్శించనుంది. మాన్ మేరీ జాన్, తూ ఆకే దేఖ్లే వంటి హిట్స్‌కు పేరుగాంచిన పాప్/హిప్-హాప్ హిట్ మేకర్ అయిన కింగ్, గాయని-గేయరచయిత్రి నటానియాతో కలిసి క్రౌన్ అనే పాట ద్వారా అడుగుపెట్టి ఈ రంగంలో కెరీర్
ప్రారంభించారు.