Maguva Mazaka Movie in Urvasi OTT, Heroine Madhu Priya, Actor DS Rao, Bheemavaram Talkies, Director Sampath Raj, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: “మగువ”తో సంచలనం సృష్టించిన మధుప్రియ తాజా సంచలనం “మగువా మజాకా” ఊర్వశి ఓటిటిలో!!
“మగువ” చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ టైటిల్ పాత్రలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం “మగువా మజాకా”. ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో సంపత్ రాజ్ దర్శకత్వంలో ఫణిరాజ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు తెగువ కలిగిన ఓ మగువ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సంపత్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈనెల 8న ఊర్వశి ఓటిటిలో “మగువా మజాకాను విడుదల చేస్తున్నామని నిర్మాత ఫణిరాజ్ తెలిపారు. “మగువ” చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ చిత్రంతో “మధుప్రియా మజాకా” అనిపిస్తుందని దర్శకుడు సంపత్ రాజ్ పేర్కొన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: పి.ఎస్, ఎడిటింగ్: వి.ఎ, కెమెరా: శ్రీను, డైలాగ్స్: మణి, నిర్మాత: ఫణిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: సంపత్ రాజ్!!