యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా పరిచయం అయిన చిత్రం లీడర్. రానాకి లైఫ్ ఇచ్చిన ఈ మూవీ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ హీరో తర్వాత వరస అవకాశాలతో దూసుకుపోయాడు.
2010 లో వచ్చిన ఈ మూవీ రానాని హీరోగా నిలబెట్టింది.అయితే ఇప్పడు 12 ఏళ్ళు తర్వాత లీడర్ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతుందననే వార్త వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో హల్ చల్ జరుగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నా నిజమే అని సినీ వర్గాలు అంటున్నాయి. అసలు విషయం ఏమిటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు మాత్రం వేచి చూడాల్సిందే.
ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా అలరించిన మహేష్ లీడర్-2 సినిమాలో ఈ పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరోసారి తమ అభిమాన నటుడిని ముఖ్యమంత్రి పాత్రలో చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
ఇటీవలే సర్కారు పాట సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రిన్స్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది.