Mahesh Babu – Balakrishna : టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో రెండు చిత్రాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డ్రామా మూవీ ‘భైరవ ద్వీపం’ (Bhairava Dweepam). రోజా (Roja Selvamani) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి కూడా భైరవ ద్వీపం నచ్చుతుంది. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమాని ఆగష్టులో రీ రిలీజ్ చేయనున్నారు. ఆగష్టు 5న ఈ మూవీ 4K ప్రింట్ తో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ సూపర్ హిట్ మూవీ ‘బిజినెస్ మెన్’ (Businessman) కూడా రీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రీ రిలీజ్ కోసం మహేష్ అభిమానులతో పాటు ఇతర హీరో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ చెప్పే డైలాగ్స్ కి యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ ఉంది. మాస్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీ 2012 సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయం అందుకుంది.
పోకిరి తరువాత మహేష్ అండ్ పూరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రాన్ని కూడా ఆగష్టులోనే రీ రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ మూవీ 4K క్వాలిటీతో రిలీజ్ కాబోతుంది.