Memu Famous : యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్(Memu Famous). చాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 30 మంది కొత్త నటీనటులు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. చిన్న సినిమా అయినా ప్రమోషన్స్ మాత్రం భారీగా, డిఫరెంట్ గా చేస్తున్నారు. తెలంగాణ కథతో, తెలంగాణ నేటివిటీలో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. నేడు మే 26న మేము ఫేమస్ సినిమా రిలీజ్ అయింది.
మహేష్ బాబు సినిమా రిలీజ్ కి ముందే సినిమా చూశాను, నచ్చింది అంటూ ట్వీట్ చేసి ఈ సినిమా హీరో, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ కి నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఒక రోజు ముందే 25 రాత్రే ఈ సినిమాకు కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. అలాగే ఓవర్సీస్ లో ఇప్పటికే షో పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా యూత్ కచ్చితం గా చూడాల్సిన సినిమా అని మహేష్ బాబు ట్వీట్ లో తెలిపారు . యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అని సుమంత్ ఈ మూవీ తో మంచి సక్సెస్ అందుకుంటాడు అని ప్రశంసించాడు .మూవీ లో మంచి మెసేజ్ వున్నట్టు తెలిపారు .