Health ఈ కాలంలో అమ్మాయిలు మేకప్ వేసుకోవడం చాలా సాధారణమైపోయింది ప్రతిరోజు మేకప్ వేసుకోని బయటకు వెళ్లడం సహజమే ఇలాంటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అందం దెబ్బ తినడంతో పాటు ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి..
మేకప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే చూడ్డానికి మరింత అందంగా కనిపిస్తారు.. అయితే ఈ మేకప్ విషయంలో పర్ఫెక్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.. డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ వంటివి ఉంటే కన్సీలర్తో వాటిని కనబడకుండా చేయవచ్చు. అయితే కన్సీలర్ ఎంపిక మాత్రం కచ్చితంగా ఉండాలి. మీ స్కిన్ టోన్‌కి బాగా దగ్గరగా ఉండే కన్సీలర్ ను ఎంచుకోవడం వల్ల.. డార్క్ సర్కిల్స్ అనేవి పూర్తిగా కవర్ అవుతాయి. అలాగే ఫౌండేషన్ విషయంలో కూడా ఎంపిక చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి.
అయితే ప్రతిరోజు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండేవారు మాత్రం లైట్ మేకప్ ను ఎంచుకోవడం మంచిది ప్రతిరోజు హెవీ మేకప్ ను వేసుకోవడం వల్ల స్కిన్ పాడయ్యే అవకాశం ఉంది… మీటింగ్స్, ఆఫీస్‌కు అటెండ్ అయ్యేవారు పర్ఫెక్ట్ మేకప్ లుక్‌ని పొందాలంటే తప్పకుండా క్యాట్ ఐ, పర్ఫెక్ట్ వర్క్ మేకప్, బుగ్గలకు కాంటర్ చేయడం వంటివి ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటాయి. అయితే అలాంటి లుక్ పొందాలని అనుకుంటే, ఎక్కువగా ఉపయోగించే మేకప్ ప్రోడక్ట్స్‌తో టింటెడ్ మాయిశ్చరైజర్, స్పాట్ కన్సీలర్ వంటి ఉత్పత్తులను ట్రై చేయటం మంచిది. ఐ మేకప్ కోసం ఫిల్డ్ ఇన్ బ్రోస్, సాఫ్ట్ బ్రౌన్ ఐ షాడో వంటివి చాలా అవసరం. చీక్స్, లిప్స్‌కు క్రీమ్ బ్లష్, లిప్ కలర్ ఉపయోగిస్తే మరింత లుక్ వస్తుంది.