Movie మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మిగిలిన అన్ని భాషల్లో బాగానే ప్రమోషన్స్ చేస్తున్న తెలుగులో మాత్రం కావలసినంత బజ్ క్రియేట్ కావటం లేదని టాక్ వినిపిస్తుంది..
మణిరత్నం ఎన్నో ఆశలతో విడుదల చేస్తున్న మూవీ పొన్నియన్ సెల్వం. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాడు దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, రజినీకాంత్ నుంచి విజయ్, మహేష్ బాబు వరకు ఎందరితోనో ప్లాన్ చేసినా చివరికి ఫైనాన్స్ ఇబ్బందులు రావడంతో సినిమాను ఇన్నాళ్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటికి మణిరత్నంతో లైకా నిర్మాణ సంస్థ వాళ్ళు చేతులు కలపడంతో ఈ మూవీ పట్టాలెక్కింది. అయితే సినిమాను ఎంత గొప్పగా తీసిన సరైన ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకుల్లోకి వెళ్ళటం కష్టమే. అయితే ఈ విషయం తెలిసిన మనరత్నం కూడా ఎందుకు తెలుగులో సరైన ప్రమోషన్స్ ఇవ్వడం లేదు అర్థం కావడం లేదు. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో అప్సెట్ అయ్యారని సమాచారం. ఇప్పటికైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే సినిమా రిలీజ్ టైం కి కొంతైనా బజ్ క్రియేట్ చేయవచ్చు అని అనుకుంటున్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి..
చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి, త్రిష ప్రముఖ పాత్రలో నటించిన ఈ మూవీని.. మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ రెండు భాగాలుగా నిర్మించింది. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.