సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ముందు ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను తీసుకువస్తోంది.
తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలిజ్ ఈవెంట్ ని నిర్వహించారు. నిర్మాతలు వివేక్ కూచిభొట్ల , శశిధర్ రెడ్డి, నవీన్ యెర్నేని, నిరంజన్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ట్రెమండస్ సక్సెస్ ని అందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్ కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ప్రేమలు, ‘మంజుమ్మల్ బాయ్స్’ చూశారా అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అటువంటు ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.