Politics ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా అక్కడ పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన పై మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 అన్ని పార్టీలకు వర్తిస్తుందని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు.. రాదు.. అని స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంపై ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని అందరికీ ఇది ఒకే రకంగా పనిచేస్తుందని తెలిపారు అలాగే ఈ జీవో ఏమైనా ఇతర పార్టీ నాయకుల్ని కట్టడి చేసేందుకు అని దాని మీద రాసి ఉందా అంటూ ప్రశ్నించారు అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు నా కుప్పం అంటూ చెప్పుకొచ్చారు అయితే ఆయనకి అసలు కుప్పంలో ఇల్లు కాని ఓటు కాని ఉందా అంటూ అన్నారు..
ఇప్పటికే నాకు ఉప్పమ్మని పలుమార్లు చంద్రబాబు నాయుడు అన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నిసార్లు కుప్పంకి వెళ్లారో కనీసం అన్ని సార్లు కూడా చంద్రబాబు నాయుడు వెళ్లలేదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో సమాధి అవుతుందని దానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులే నిదర్శనం అంటూ చెప్పవచ్చారు.. అలాగే అక్కడ టిడిపి చరిత్ర ముగిసిపోయిందని చెప్పుకొచ్చారు..