Political హైదరాబాద్ పరిధిలో మెట్రో కారిడార్ పొడిగింపుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్ మెట్రోను హయత్‌నగర్ వరకు పొడిగించడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ మెట్రో పనులు రెండో దశ తొందరలోనే ప్రారంభం కానున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ మెట్రో కారిడార్ను హయత్ నగర్ వరకు పొడిగించనున్నారని తెలిపారు.. అలాగే నాగోల్-ఎల్బీ నగర్ మధ్య మెట్రో అనుసంధానించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా త్వరలోనే మూసి నదిపై 14 బ్రిడ్జిలు కడతామని ప్రకటించిన మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది టిఆర్ఎస్ పార్టీ అని దేమా వ్యక్తం చేశారు అలాగే కచ్చితంగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు… ముఖ్య మంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ఏ వస్తుందని అంటున్న కేటీఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎప్పుడూ ముందుంటామని అన్నారు..
మంగళవారం నాడు ఎల్బీనగర్ పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో.. పెట్ యానిమల్ శ్మశాన వాటిక ప్రారంభించారు.
బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా బాక్స్ డ్రైన్‌ను ప్రారంభించారు. అలాగే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు.. లింక్‌రోడ్డు ప్రారంభించారు.