మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25, 2022న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలకానుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
నటీనటులు : రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు
సాంకేతిక బృందం :
కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్
సంగీతం : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్
పీఆర్వో : వంశీ-శేఖర్