Mass Maharaja Ravi Teja, Divyansha Koushik, Sarath Mandava, SLV Cinemas LLP Production No 4 Launched
మాస్ మహారాజా రవితేజ, శరత్ మండవ, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడక్షన్ నెం.4 ప్రారంభం.
2021లో `క్రాక్` సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్ మహారాజ రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమ వుతున్నారు. శరత్ మండవ మన తెలుగు వారే… గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు రచయితగా పనిచేశారు.
రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది. రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు శరత్ మండవ.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ నెం.4గా రూపొందుతోన్న ఈ మూవీ ఉగాది పర్వదినం సందర్భంగా (ఏప్రిల్ 13) సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రవితేజ క్లాప్ కొట్టగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి స్క్రిప్ట్‌ను దర్శకుడు శరత్ మండవకి అందజేశారు.
ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తారాగణంః
రవితేజ, దివ్యాంశ కౌశిక్
సాంకేతిక నిపుణులుః
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం: స్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఆర్ట్: సాయి సురేష్
స్టిల్స్: సాయి రామ్ మాగంటి
పిఆర్ఓ: వంశీ- శేఖర్
https://youtu.be/5hCaLUCH0YQ
Cast:
Ravi Teja, Divyansha Koushik
Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP
Music Director: Sam CS
DOP: Sathyan Sooryan
Art Director: Sai Suresh
Stills: Sai Ram Maganti
PRO: Vamsi-Shekar