Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Trailer On April 12th,
ఏప్రిల్12న విడుదలకాబోతున్న మాస్‌మహారాజ రవితేజ, రమేష్ వర్మల హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఖిలాడి` టీజర్
క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘రాక్షసుడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌పోస్టర్, మాస్ మహారాజ్ రవితేజ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ సాధించడంతో సినిమా భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో రవితేజను చాలా పవర్‌ఫుల్ లుక్‌లో చూపించారు దర్శకుడు రమేష్ వర్మ. చేతిలో సుత్తి పట్టుకుని కంటైనర్ బాక్సుల నడుమ రవితేజ స్టైలిష్‌గా నడుస్తున్న లుక్ చూసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. వారి అంచనాలకు ధీటుగా హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవల ఇటలీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్‌కొరియోగ్రఫి చేస్తుండడం విశేషం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖిలాడి టీజర్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్12, ఉదయం 10.08నిమిషాలకు విడుదలచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవల ఇటలీలో షూటింగ్ కి సంబందించి టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఎక్కడా కాంప్రమైజ్‌కాకుండా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్నది. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతీలాల్ గడ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు(క్రాక్ ఫేమ్)
స్క్రిప్ట్ కో ఆర్డినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సాగర్
ఎడిటింగ్: అమర్ రెడ్డి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
పాటలు: శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
పీఆర్వో: వంశీ-శేఖర్.
Technical Crew:
Story, Screenplay, Direction: Ramesh Varma
Producer: Satyanarayana Koneru
Banners: A Studios, Pen Studios
Production: A Havish Production
Presents: Dr Jayantilal Gada
Music Director: Devi Sri Prasad
Cinematography: Sujith Vasudev and GK Vishnu
Script Co-ordination: Patrikeya
Fights: Ram-Lakshman, Anbu-Arivu
Dialogues: Srikanth Vissa, Sagar
Editing: Amar Reddy
Lyrics: Srimani
Stills: Sai Maganti
Makeup: I. Srinivasaraju
Executive Producer: Muralikrishna Kodali
Production Head: Poorna Kandru
Publicity: Ram Pedditi Sudheer
Co-Director: Pavan KRK
Art: Gandhi Nandikudkar
PRO: Vamsi Shekar