Latest News : వైద్య రంగంలో ఎన్నో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ భాగంగా పేషెంట్ కు సినిమాలు చూపించడం లేదా సంగీత వినిపించడం వంటివి చేసి పేషెంట్ కి తెలియకుండానే ఆపరేషన్ చేసేస్తారు వైద్యులు. ఇదో గొప్ప ట్రీట్మెంట్ గా కూడా చెప్పుకోవచ్చు. అలానే సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్ తమ అభిమానులు సందర్శిస్తే వెంటనే ఆరోగ్యంతో కోలుకుంటారు మరికొంతమంది పేషంట్ లు ఇవన్నీ మనం సోషల్ మీడియా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది.
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రోగి స్పృహలో ఉండగానే ఎంతో కష్టమైన సర్జరీని నిర్వహించారు వైద్యులు. 50 ఏళ్ల సంవత్సరాల కు చెందిన మహిళ మెదడులోని కణతిని ఆమెకు సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ చాలా ఈజీగా తీసేశారు. హైదరాబాద్ కి చెందిన గత కొన్ని నెలల నుండి అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆమె మెదడులో కణతిని గుర్తించారు. వెంటనే కణితిని తొలగించాలని ఆమెకు సూచించడం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 25న ఆమెకు ఆపరేషన్ ఏర్పాటు చేశారు వైద్యులు. అయితే ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ట్యాబ్‌లో మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని చూపిస్తూ ఆపరేషన్ చేశారు వైద్యులు.
హైదరాబాద్‌కు చెందిన ఓ యాభై ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి, ఆమె మెదడులో కణతిని గుర్తించారు. వెంటనే ఆ కణితిని తొలగించాలని, ఆగస్టు 25న ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే ఆపరేషన్ సమయంలో ఆమె ఎలాంటి హ ఒత్తిడికి గురికాకుండా ట్యాబ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా పెట్టి అదిచూస్తుండమని ఆమెకి ఇచ్చారు. మధ్యమధ్యలో ఆమెతో మాట్లాడుతూ ఆపరేషన్ చేశారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఇంకో మూడు రోజుల్లో ఆమెను కలవనున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.