నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారు గెస్ట్‌గా విచ్చేశారు.
వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి.అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్