Movie తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చింది దర్శక ధీరుడు రాజమౌళి అలాంటి రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకుంటారు మన టాలీవుడ్ హీరోలు.. రాజమౌళి సినిమా అంటేనే హిట్ అనే టాక్ ఫిక్స్ అయిపోతారు అభిమానులు అంతేకాకుండా నిర్మాతలు కూడా ఏమాత్రం భయం లేకుండా ఎంత అంటే అంత బడ్జెట్ కు వెనకాడరు.. సిల్వర్ స్క్రీన్ పై సంచలనమే సృష్టిస్తారు దర్శక ధీరుడు.. అలాంటి రాజమౌళి తో సినిమా చేసే ఉద్దేశం తనకి లేదంటున్నారు మెగాస్టార్ చిరంజీవి…
దర్శకధీరుడు రాజమౌళితో తనకు సినిమా చేసే ఉద్దేశం లేదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే ఆయన మీద మాత్రం చాలా గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఓ ప్రెస్ మీట్ లో ఇలా చెప్పుకొచ్చారు.. డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు అయితే అతని మీద చాలా గౌరవం ఉంది అలాగే ఓ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ఆలోచన నాకు లేదు అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు..
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఫాదర్ మాత్రమే కాకుండా భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు మెగాస్టార్.