Movie టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ను పొందినట్టు చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెలిపారు..
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది దీంతో సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చిత్ర బృందం ప్రమోషన్స్ పైన పూర్తి ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రమోషన్ సరిగ్గా లేవని చిరు ప్రేక్షకులు కోపం మీద ఉన్నారు అయితే ఇకమీదటైనా సినీ బృందం సినిమాకు కావలసినంత బస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇంకా మంచి అవకాశాలు ఉంటాయని టాక్ వినిపిస్తుంది.. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా లో పక్క పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారు చిరు. రాష్ట్ర రాజకీయాల్ని ఏకచక్రంగా శాసించే వ్యక్తి వెనుక ఉండి నడిపించే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. అయితే ఈ సినిమాకి సంబంధించిన డైలాగుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మలయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నయనతార చిరంజీవికి చెల్లిగా కనిపించనుంది. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించారు.