ఆ యువకుడికి మతిస్థిమితం లేదు.. కానీ కుటుంబ సభ్యులు కూడా తమలో ఒక్కడిగా చూసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ యవకుడు తనకు పెళ్లి చేయాలని మారం చేయడం మొదులు పెట్టాడు. కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోక పోవడంతో తన తండ్రితో పాటు బాబాయ్‌ను హత్యచేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు….
మోపాల్ మండల కేంద్రానికి చెందిన పెద్ద అబ్బయ్యకు ముగ్గురు కుమారులు ఉండగా ప్రస్తుతం ఇద్దరు ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో పని చేస్తున్నారు. అబ్బయ్య రెండవ కుమారుడు నితీష్ (28) ఎనిమిదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి ఓ ఏడాది పాటు పని చేశాడు. మానసిక వేధనకు గురై వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సతీష్‌ను స్వగ్రామానికి రప్పించారు. సొంతూరికి వచ్చిన తర్వాత సతీష్ తనకు పెళ్లి చేయాలని తరచూ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగేవాడు. కొన్ని రోజుల తరువాత తానే తనకు తెలిసిన అమ్మాయిని చూసుకుని పెళ్లి కుదర్చుకున్నానని అమ్మాయి తరఫున బంధువులు ఈ నెల 14 మన ఇంటికి రానున్నారని తండ్రితో సతీష్ చెప్పాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తండ్రి అబ్బయ్య వాకిలి ఊడుస్తుండగా అక్కడికొచ్చిన కొడుకు సతీష్ పెళ్లి ప్రస్తానవ తేవగా ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సతీష్ అక్కడే ఉన్న పారతో తండ్రిపై దాడిగి దిగుతుండగా గమనించిన అబ్బయ్య తమ్ముడు నడిపి సాయిలు అడ్డుకోబోతుండగా అతడిపై కూడా అదే పారతో దాడికి తెగబడ్డాడు. ఇరువురిపై పారతో కొట్టగా అన్నదమ్ములిద్దరూ సృహ కోల్పోయారు. కిందపడిన ఇద్దరిని ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్నా తర్వాత అక్కడి నుంచి సతీష్ పరారయ్యాడు. ఈ క్రమంలో తల్లి పిన్ని ప్రాణాలతో తప్పించుకున్నట్లు ఇరుగుపోరుగు వారు తెలిపారు. వారిపై కూడా దాడి చేసేందుకు యత్నిస్తుండగా ఒకరి ఇంట్లోకెళ్లి గడియపెట్టుకోగా మరొకరూ బయటకు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారన్నారు.