Minister Jagadish Reddy Comments Nakerekal Muncipal Elections, Telangana Politics,Telangana News,
*ప్రజల చేతిలో ఓటు బ్రహ్మాస్త్రం* #తలరాతలు మారుస్తుంది #ప్రజల భవిష్యత్ ను నిర్దేశిస్తుంది #ఎటు మలుచుకుంటే అటే మల్లుతుంది #2014,18లలో వేసిన ఓటుతోటే ఫించన్లు 2,000,3,000 పెరిగాయి #అదే ఓటు తోటే సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి *-నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి జగదీష్ రెడ్డి*
ఓటు బ్రహ్మాస్త్రం లాంటిదని దానిని ఎటు మలుచుకుంటే అటు మల్లుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంచి వైపు మల్చుకుంటే మంచి వైపు…చెడు వైపు మలుచుకుంటే చెడు వైపే మల్లుతుందన్నది కుడా ప్రజలు గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.2014,18 వరుస ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి వైపే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని కారు గుర్తుకు ఓటు వేసినందునే ఫించన్లు ఆసరా 2,000 వికలాంగులకు 3,000 లకు పెరిగాయని ఆయన గుర్తుచేశారు.మీరు వేసే ఒక్కో ఓటు తల రాతలు మారుస్తోందని,అదే ఓటు మీ భవిష్యత్తు ను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ పురపాలక సంఘానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోజున పట్టణంలోని 12,13 ,11 వ వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అధ్యక్షత వహించిన ఆయా ఎన్నికల ప్రచార సభలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ ,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మీరు 2014 లో వేసిన ఓటుతో కేవలం 200 ఉన్న ఫించన్ ఒక్కసారిగా 1000 రూపాయలకు పెరిగిందని వికలాంగులకు 1500 కు పెరిగిన విషయం గమనించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే 2018 ఎన్నికల్లో వేసిన ఓటు తో 1000 రూపాయల ఫించన్ 2000 రూపాయలకు 1500 ఉన్న వికలాంగుల ఫించన్ 3000 లకు పెరిగిందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అన్నారు.కలలో కూడ ఉహించనిది…ఊహకు అందనిది విప్లవాత్మకమైన రైతుబంధు, రైతుభీమా పధకాలు కూడా అదే ఓటు తోటే అమలులోకి వచ్చిందన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు.ఇప్పుడు నకిరేకల్ పురపాలక సంఘం ఎన్నికల్లో కూడా మీరు ఓటు వేసేటప్పుడు రైతుబందు,రైతుభీమా,కళ్యాణాలక్ష్మి/షాధిముబా రక్ లతో పాటు అమ్మవడి,కేసీఆర్ కిట్ ఇంటింటికి మంచి నీళ్ల పధకం మిషన్ భగీరథ ,వవసాయరంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాలపై చర్చ కు పెట్టాలన్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన రోజున ఓటరు ఆలోచించి ఓటు వేసినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగలిగారని తద్వారా అంతటి అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడిందని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా అదే కారు ను గెలిపించుకోవడం ద్వారనే నకిరేకల్ ను సుందరికరించుకోవచ్చని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.