Telugu World Now
No Result
View All Result
Tuesday, June 24, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Latest News

Political News: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

Minister Nirmala Seetharaman, KTR, Telangana Politics, TRS, Telangana News, Telugu World Now,

Sowmya by Sowmya
May 11, 2024
in Latest News, Politics, Telangana
Political News: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

Minister Nirmala Seetharaman, KTR, Telangana Politics, TRS, Telangana News, Telugu World Now,

Political News: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

★ ఏదీ భరోసా? ★ ఆత్మనిర్భర్‌ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి? ★ కార్పస్‌ ఫండ్‌ స్కీం మార్గదర్శకాలు ఏవి? ★ ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ ★ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ★ ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి ★ పరిశ్రమలకు భారీ ఆర్థిక గ్రాంట్‌ను ఇవ్వాలి ★ నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ.

కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కరోనాకు ప్రభావితమైన రంగాలను ఆదుకోవడానికి ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ఆకర్షణీయంగా లేదని తెలిపారు. ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన ‘కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌’ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాకపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని పునర్నిర్వచించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు.

కేటీఆర్‌ లేఖలోని ముఖ్యాంశాలు
ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించి ఒక సంవత్సరం పైగా కావస్తున్నది. తెలంగాణ రాష్ట్ర తయారీరంగానికి వెన్నెముకగా నిలుస్తున్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా నేను గట్టి ప్రయత్నంచేస్తూ వచ్చాను. కరోనా సంక్షోభం ద్వారా ప్రభావితమైన ఇక్కడి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నా ను. రాష్ట్రంలో ఉన్న 80%పైగా ఎంఎస్‌ఎంఈలు లాక్‌డౌన్‌ క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25% పైగా ఎంఎస్‌ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగింది. మీరు ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన ‘గ్యారంటీడ్‌ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ స్కీం’ కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం మార్గదర్శకాలలోప్రత్యేక ఆకర్షణ ఏమీలేదని తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు భావిస్తున్నాయి. ఈ పథకంద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతున్నాయి.. ఒక్కో యూనిట్‌ ఒక్కో విధమైన సవాలును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో అన్ని ఎంఎస్‌ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా అవసరాలు తీరే అవకాశంలేదు. కరోనా వల్ల కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వడం ద్వారా ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవచ్చని భావిస్తున్నాను. సంవత్సరానికి పైగా సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఈ రోజుకి కూడా సప్లై చైన్‌ డిస్ట్రిబ్యూషన్‌, తీవ్రమైన లేబర్‌ కొరతతో కష్టాలుపడుతున్నాయి. మరికొన్ని ఎంఎస్‌ఎంఈలు మారిన కస్టమర్ల ప్రాధాన్యాల సమస్యను ఎదుర్కొంటున్నాయన్న విషయాన్ని మీరు సైతం అంగీకరిస్తారని భావిస్తున్నాను.

కార్పస్‌ ఫంఢ్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి
ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం మరో రెండు పథకాలు ప్రకటించారు. దురదృష్టవశాత్తు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా ఈ పథకాలు ప్రారంభమైన పరిస్థితి కనిపించడం లేదు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన ‘సబార్డినెట్‌ డెబ్ట్‌’ స్కీం.. అత్యంత తక్కువ రుణమొత్తాన్ని అందిస్తున్నది. ఎంఎస్‌ఎంఈల వయబిలిటీపైన స్పష్టతలేని పరిస్థితుల్లో మీరిచ్చే అత్యంత తక్కువ రుణమొత్తం.. ఎంఎస్‌ఎంఈల అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదు. ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు కూడా విడుదలకాలేదు. వీటిని వెంటనే విడుదలచేయాలి.

బడా కంపెనీలకే అండ
ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్‌ఎంఈలపై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం బడా కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉన్నది. దేశీయ ఎంఎస్‌ఎంఈలతో కూడిన ఒక సప్లై చైన్‌ ఏర్పాటుచేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పీఎల్‌ఐ ప్రయోజనాలను ఎంఎస్‌ఎంఈలతో పంచుకొనేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చవలసిన అవసరమున్నది. గతేడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభకాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాం. ప్రస్తుతం ఉన్న కరోనా రెండోదశను సైతం దాటి కొనసాగుతున్నది. త్వరలోనే మూడోదశ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని మరోసారి పునర్నిర్వచించడం ద్వారా కరోనా వల్ల అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకొంటుందని, కేంద్రంచేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ర్టాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటుందని ఆశిస్తున్నాను.

Minister Nirmala Seetharaman, KTR, Telangana Politics, TRS, Telangana News, Telugu World Now,

Source: Minister Nirmala Seetharaman, KTR, Telangana Politics, TRS, Telangana News, Telugu World Now,
Via: Minister Nirmala Seetharaman, KTR, Telangana Politics, TRS, Telangana News, Telugu World Now,

Related Posts

Celebrating the 50th birthday of renowned music director late Chakri garu in line with his aspirations, Latest News, Telugu World Now
Latest News

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

June 15, 2025
Colour Photo Team Receives Gaddar Award from CM Revanth Reddy for Being the Second Best Film of 2020, Latest Telugu News, Telugu World Now
Latest News

FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’

June 15, 2025
Telangana Gaddar Film Awards (TGFA) 2024 Ceremony to Be Held Grandly at Hitex on June 14th, CM Revanth Reddy, Komatireddy Venkat Reddy, Dil Raju, Hitex Exhibition Center, Telugu World Now
Latest News

Telangana Gaddar Film Awards : జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2024 వేడుక

June 9, 2025
వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!
Latest News

వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!

June 8, 2025
Cannes 2025, ‘M4M’ World Premiere Makes History for Mohan Vadlapatla & Jo Sharma, Mohan Vadlapatla, PALAIS-C theatre, Cannes Film Festival 2025, Telugu World Now
Latest News

Cannes 2025 : కేన్స్ 2025లో మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ స్క్రీనింగ్, రెడ్ కార్పెట్‌పై దక్కిన గౌరవం

May 20, 2025
Ram Charan and his pet dog Rhyme Make History at Madame Tussauds After Queen Elizabeth, Upasana, Megastar Chiranjeevi, Surekha, Tollywood News, Telugu World Now
Latest News

Ram Charan : మేడమ్ టుస్సాడ్స్ లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

May 12, 2025
Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny, Krishna Sai International Charitable Trust, Tollywood News, Telugu World Now
Latest News

Tollywood News : జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

May 12, 2025
M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate, Mohan Vadlapatla, Mcwin Group USA, Narendra Modi, Telugu World Now
Latest News

WAVES Summit 2025 : ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు ‘వేవ్స్ సమ్మిట్ 2025’ కు ఆహ్వానం

May 5, 2025
I want Dil Raju's 'Lorven AI' studio to take the entertainment world to the next level, Telangana IT Minister Sri Duddilla Sridhar Babu, Tollywood News, Telugu World Now
Latest News

Tollywood News : దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో సూపర్ : తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

May 4, 2025
Rachakonda Police Cooperative Credit Society 2025 Calendar unveiled by Commissioner, Sri Sudheer Babu, IPS, Rachakonda News, Telugu World Now
Latest News

రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కమిషనర్

April 16, 2025
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025
Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

Latest Telugu Movies : సుహాస్ , కీర్తి సురేష్ “ఉప్పు కప్పురంబు” ట్రెయిలర్ లాంచ్

June 19, 2025
Solo Boy Trailer Launch, Director P Naveen Kumar, Gautham krishna , Shweta Avasthi, Latest Telugu Movies, Telugu World Now

సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన గౌతమ్ కృష్ణ

June 19, 2025
Celebrating the 50th birthday of renowned music director late Chakri garu in line with his aspirations, Latest News, Telugu World Now

ప్రముఖ సంగీత దర్శకులు దివంగత చక్రి గారి ఆశయాలకు అనుగుణంగా 50 వ జన్మదిన వేడుకలు

June 15, 2025
Colour Photo Team Receives Gaddar Award from CM Revanth Reddy for Being the Second Best Film of 2020, Latest Telugu News, Telugu World Now

FILM NEWS : 2020 ఏడాదికి సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’

June 15, 2025
Phanindra Narsetti & Ananthika Sunilkumar's '8 Vasanthalu' Visually Poetic, Heart Touching Trailer Released, Latest Telugu Movies, Telugu World Now

Latest Telugu Movies : ‘8 వసంతాలు’ హార్ట్ టచ్చింగ్ ట్రైలర్ రిలీజ్

June 15, 2025
‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్

June 14, 2025
Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

Latest Movie News : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ నుంచి ‘సౌండ్ అఫ్ లవ్’ సాంగ్  రిలీజ్

June 14, 2025
Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

Upcoming Movie : పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రిభాషా చిత్రం “డ్యూడ్”, హీరో కమ్ డైరెక్టర్ తేజ్

June 13, 2025
Telangana Gaddar Film Awards (TGFA) 2024 Ceremony to Be Held Grandly at Hitex on June 14th, CM Revanth Reddy, Komatireddy Venkat Reddy, Dil Raju, Hitex Exhibition Center, Telugu World Now

Telangana Gaddar Film Awards : జూన్‌ 14న హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2024 వేడుక

June 9, 2025
వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!

వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్!

June 8, 2025
AGE CREATIONS, S 2H 2 Entertainments Banners, Vemuri Anand Chowdary And CH Hari Prasad, Prema Deshapu Yuvarani in OTT Amazon Prime, Film News, Telugu World Now

FILM NEWS : OTT Amazon Prime లో దూసుకు పోతున్న ‘ప్రేమ దేశపు యువరాణి’

June 1, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

June 19, 2025
 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

 కుబేర సినిమా ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: కింగ్ నాగార్జున

June 19, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us